Published : 23 Sep 2022 02:19 IST

Rahul Gandhi: ‘ఒక వ్యక్తికి-ఒకే పదవి’కి కట్టుబడి ఉండాల్సిందే..!

పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్య

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడిన వేళ.. పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టే అంశంపై అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, పార్టీలో ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ (One-man, One-post) నియమాన్ని పాటించాలని స్పష్టం చేశారు. సీఎం పదవితోపాటు ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతానంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెబుతోన్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు.

కేరళలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో ఒకవ్యక్తి-ఒకే పదవిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అనేది కేవలం ఓ సంస్థకు సంబంధించిన స్థానం కాదు. అదొక సిద్ధాంతపరమైన స్థాయి, విశ్వసనీయ వ్యవస్థ. పార్టీలో పదవులపై ఉదయ్‌పుర్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టినా సరే.. అభిప్రాయాల సమూహం, విశ్వసనీయ వ్యవస్థ, దేశపు దార్శనికతను ఆ పదవి తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ పడేందుకు సీనియర్‌ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శశిథరూర్‌, అశోక్‌ గహ్లోత్‌ వంటి నేతలు రేసులో ఉన్నట్లు ఇప్పటికే తెలియజేయగా.. దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్‌ వంటి సీనియర్లు కూడా ఇందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహించనున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని