KTR: తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి

తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అలీయాక్సిస్‌ కంపెనీ ప్రకటించింది.

Published : 24 May 2022 15:30 IST

దావోస్‌: తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అలీయాక్సిస్‌ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అనంతరం తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అలీఆక్సిస్‌ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆశీర్వాద్‌ పైప్స్‌కు చెందిన అలీఆక్సిస్‌ కంపెనీ ప్లాస్టిక్‌ పైపులు, యాక్సెసరీస్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని