AP Cabinet: మంత్రులకు శాఖల కేటాయింపు.. కొనసాగుతున్న చంద్రబాబు కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 

Published : 13 Jun 2024 20:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు గురువారం మధ్యాహ్నం అమరావతి చేరుకుని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. 

మరో వైపు పవన్‌ కల్యాణ్‌కు ఉపముఖ్యమంత్రితో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని