Opposition meet: విపక్షాల భేటీకి కొత్త డేట్‌ ఫిక్స్‌.. హాజరయ్యే నేతలు వీరే!

భాజపాను నిలువరించడమే లక్ష్యంగా విపక్షాల ఉమ్మడి భేటీకి కొత్త తేదీ ఖరారైంది.ఈ నెల 23న పట్నాలో భేటీ కావాలని నిర్ణయించినట్టు బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు.

Published : 07 Jun 2023 23:05 IST

(ఫైల్‌ ఫొటో)

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ నెల 12న పట్నాలో జరగాల్సిన విపక్షాల భేటీ వాయిదా పడటంతో కొత్త తేదీని నిర్ణయించారు. జూన్‌ 23న పట్నాలోనే విపక్షాల నేతలంతా సమావేశమవుతారని బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ వెల్లడించారు. బుధవారం ఆయన జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కీలక భేటీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆప్‌ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు అంగీకరించినట్టు తేజస్వీ తెలిపారు. అలాగే, భాజపాయేతర పార్టీల నుంచి అనేకమంది నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 

గతంలో జూన్‌ 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ డీఎంకే, కాంగ్రెస్‌ సహా పలు పార్టీల కోరిక మేరకు తేదీలను మార్పు చేశారు.  భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి జరిగే విపక్షాల కీల భేటీ (opposition meet)కి ఆయా పార్టీల అధినేతలు కాకుండా వేరే నేతలెవరినైనా పంపడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు ఇటీవల బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు