AIADMK: పార్టీలో శశికళ పునరాగమనానికి నో ఛాన్స్‌: పళనిస్వామి

అన్నాడీఎంకే పార్టీలోకి శశికళను తిరిగి తీసుకోబోమని మాజీ సీఎం పళనిస్వామి మరోసారి స్పష్టం చేశారు.

Updated : 28 Mar 2022 05:25 IST

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే పార్టీలో విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ సీఎం, పార్టీ ముఖ్యనేత పళని స్వామి శశికళకు పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు. అదో ముగిసిన అధ్యాయమని అన్నారు. కొద్దిరోజుల క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ శశికళ అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో శశికళను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో శశికళ పునరాగమనంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా పళనిస్వామి వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు తెరదించాయి.

‘‘శశికళను పార్టీలోకి తిరిగి చేర్చుకోకూడదంటూ పార్టీ నాయకత్వం తీర్మానించింది. దీన్నిపార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు కూడా సమర్థించాయి. తిరిగి ఆమెను పార్టీలో చేర్చుకునే ఉద్దేశం లేదు’’ అని పళని స్వామి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను, పన్నీర్‌ సెల్వం గతంలో పార్టీ వర్గాలకు స్పష్టం చేశామని చెప్పారు.

ఏఐడీఎంకే కీలక పదవుల్లో ఉన్న ఇరువురు ముఖ్యనేతలు శశికళ గురించి ఇలా భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో పార్టీ వర్గాల్లో గందరగోళం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం పన్నీర్‌ సెల్వం పార్టీ సమన్వయకర్తగా వ్వవహరిస్తుండగా, పళనిస్వామి సంయుక్త సమన్వకర్తగా ఉన్నారు. అయితే పార్టీ వర్గాల్లో పళనిస్వామికే ఎక్కువగా పట్టుడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని