అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు యాదవ్‌

రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు.

Updated : 18 Jun 2024 15:14 IST

విశాఖ: రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతోందని గర్వంగా చెబుతున్నాం. అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దేశంలోనే నంబర్‌ వన్‌ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం. రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైకాపాది. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతోంది. విశాఖకు మళ్లీ పూర్వవైభవం కల్పించే బాధ్యత మాది’’ అని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని