Palla Srinivasarao: తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?

తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది.

Updated : 14 Jun 2024 17:28 IST

అమరావతి: తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని