Pankaja munde: మధ్యప్రదేశ్‌లో మళ్లీ మాదే అధికారం: పంకజ ముండే

మధ్యప్రదేశ్‌లో మరోసారి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మహారాష్ట్ర  భాజపా నేత పంకజ ముండే అన్నారు.

Published : 10 Jun 2023 23:04 IST

జబల్పూర్‌: మధ్యప్రదేశ్‌లో మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా కార్యదర్శి పంకజ ముండే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆఖర్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. లాడ్లీ బెహనా యోజన కింద రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందించేలా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ తీసుకున్న చర్యలను ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, కార్మికులు, విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించాయన్నారు. 

ఈ సందర్భంగా మత మార్పిడి కుట్ర పేరుతో కొన్ని వర్గాలు మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తుండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. స్వచ్ఛమైన ప్రేమ అయితే.. దాన్ని గౌరవించాల్సిందే. కానీ, చెడు ఉద్దేశంతో కుట్రపూరితంగా ఉంటే మాత్రం దాన్ని వేరే కోణంలో చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను భాజపాకు చెందిన వ్యక్తినే కానీ.. ఆ పార్టీ తనది కాదంటూ ఇటీవల తన అసంతృప్తిని బయటపెట్టిన పంకజ ముండే.. తన తండ్రి దివంగత నేత గోపీనాథ్ ముండే అడుగుజాడల్లోనే భాజపాకు సేవలందిస్తానని శనివారం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని