అక్కడి నుంచి హ్యాట్రిక్‌ కొడతా: పన్నీర్‌ 

తమిళనాడులో నామినేషన్ల కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పటికే అభ్యర్థులను .......

Published : 12 Mar 2021 18:47 IST

చెన్నై: తమిళనాడులో నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన రాజకీయ పార్టీలు నామినేషన్ల ప్రక్రియ షురూ చేశాయి. ఈ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానమైన బోడినాయకనూరు నుంచి బరిలో నిలుస్తున్న అన్నాడీఎంకే నేత, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలు ఇదే స్థానం నుంచి గెలుపొందినట్టు చెప్పారు. తన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. తన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తితో ఉండబట్టే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీ తనకు అవకాశం కల్పించిందన్నారు. ఈ ఎన్నికల్లోనూ తనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏప్రిల్‌ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని