KTR-Pawan Kalyan: రామ్‌ భాయ్‌.. మీ ఛాలెంజ్‌ స్వీకరించా: పవన్‌కల్యాణ్‌

చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు.

Updated : 07 Aug 2022 14:10 IST

అమరావతి: చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌తో పాటు పవన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ ‘చేనేత’ సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని