
Pawan kalyan: అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి: పవన్
అమరావతి: కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్.. ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలు సృష్టిస్తున్నారని.. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు.. రాష్ట్ర ప్రలజందరికీ తెలుసన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోంమంత్రి చేసిన ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ లోపాలు, శాంతిభద్రతల పరిరక్షణలో అసమర్థతను, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దడం సరికాదన్నారు.
కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయొద్దు: సీపీఎం
కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా అందరిదీ.. అంబేడ్కర్ అందరివాడన్నారు. స్వార్థపర శక్తులు ప్రజల్లో ద్వేషాగ్నిని రెచ్చగొడుతున్నాయని.. ప్రజలు, పోలీసులు సంయమనంతో వ్యహరించాలని కోరారు. సామరస్య వాతావరణం పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
-
India News
IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
-
Movies News
Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్‌ప్రీత్ హాట్ స్టిల్!
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్ 284 ఆలౌట్.. టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి