Pawan kalyan: ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు దక్కని ఊరట: పవన్‌

రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు...

Published : 06 Feb 2022 16:45 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచకుండా ఆధిపత్య ధోరణితో వెళ్లిందని ఒక  ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఉద్యోగులకు ఊరట లభించలేదన్నారు. ఫిట్‌మెంట్‌, గత హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు, అశుతోష్‌ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందన్నారు. డిమాండ్లు నెరవేరకుండానే సమ్మె నిర్ణయం ఉపసంహరించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పీఆర్సీ  స్టీరింగ్‌ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించిందని దుయ్యబట్టారు. సమ్మె ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటుందన్నారు.  ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గం పట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుందని పవన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని