Pawan Kalyan: అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లేకుండా ఈ దాడులేంటి?: పవన్‌కల్యాణ్
ఏపీ అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైకాపాను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలి. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. జీవో నంబర్ 1పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం దారుణం. చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇలాంటి దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎంపైనా ఉంటుంది’’ అని పవన్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Operation Bluestar: ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 39ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది..?
-
General News
Weather: మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు!
-
Crime News
Gold: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత
-
Sports News
WTC Final: ఐపీఎల్‌తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్‌మన్ గిల్
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు