Pawan Kalyan: కౌలు రైతుల కడగండ్లకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం: పవన్‌

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులతో గురువారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు.త్వరలో రైతుల కష్టాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

Updated : 30 Mar 2023 21:16 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల కడగండ్లకు వైకాపా విధానాలే కారణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులతో గురువారం హైదరాబాద్‌లో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కౌలు రైతుల స్థితిగతులపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పవన్‌కు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. త్వరలో రైతుల కష్టాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తాం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు