Pawan Kalyan: ఉద్యోగులను భయపెట్టేందుకే సవాంగ్‌ బదిలీ: పవన్‌ కల్యాణ్‌

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ డిమాండ్‌ చేశారు.  ఏపీ డీజీపీగా ఈరోజు మధ్యాహ్నం

Updated : 16 Feb 2022 05:15 IST

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ డిమాండ్‌ చేశారు.  ఏపీ డీజీపీగా ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న సవాంగ్‌ను ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు... కానీ, వైకాపా ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. లేని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్‌పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఉన్నతాధికారుల నుంచి చిన్న పాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకే సవాంగ్‌  బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే ఏపీ సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తోంది’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని