Pawan Kalyan: కనకదుర్గమ్మ చెంత ‘వారాహి’కి పవన్‌ ప్రత్యేక పూజలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 25 Jan 2023 11:41 IST

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి దుర్గమ్మ చెంత పూజలు నిర్వహించారు. మంగళవారం తెలంగాణలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాల వద్ద ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయించిన పవన్‌.. నేడు విజయవాడ చేరుకున్నారు. 

తొలుత పవన్‌కు అభిమానులు, జనసేన నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభిమానులను ఉద్దేశించి పవన్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. ఇవాళ్టి నుంచి ఏపీలో రాక్షస పాలనను అంతం చేయడమే ‘వారాహి’ లక్ష్యమని చెప్పారు. మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో పవన్‌ సమావేశం కానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని