Amit Shah-Pawan Kalyan: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెలంగాణలో భాజపా-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చర్చించారు.

Updated : 25 Oct 2023 19:17 IST

దిల్లీ: తెలంగాణలో భాజపా-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చర్చించారు. ఈ సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు భేటీ కొనసాగింది. ఇప్పటికే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో భాజపాకు మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని