Pawan Kalyan అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్
రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
మంగళగిరి: బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.
‘‘భారాస పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించింది. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై భారాస స్పందించాలి. అన్యాయంపై భారాస వివరణ ఇవ్వాలి. బీసీ కులాల తొలగింపుపై వైకాపా, తెదేపా స్పందించాలి. బీసీలకు జనసేన అండగా ఉంటుంది. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తా. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్