Pawan Kalyan: ఎన్టీఆర్‌ తెలుగువారి సత్తా దిల్లీకి చాటారు: పవన్‌

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated : 28 May 2023 13:20 IST

అమరావతి: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.  

‘‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే  అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది.

దిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా దిల్లీ దాకా చాటారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగంల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా తరఫున, జనసేన శ్రేణుల పక్షాన  నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు