Pawan Kalyan: రెండు -మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తా!

రాష్ట్రంలో ఏప్రిల్‌ 8న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా బలమైన పోరాటం చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు......

Published : 20 Sep 2021 16:46 IST

పరిషత్‌ ఎన్నికల్లో జనసేన విజేతలకు అభినందనలు తెలిపిన జనసేనాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 8న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా బలమైన పోరాటం చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందినట్టు తెలుస్తోందన్నారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ జనసేన తరఫున, జన సైనికుల తరఫున, నాయకులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి? ఏ నేపథ్యంలో జరిగాయన్న అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని.. మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా పవన్‌ విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని