Pawan Kalyan: మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం: పవన్‌

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Published : 21 Sep 2023 01:34 IST

అమరావతి: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ‘నారీ శక్తి వందన్‌ అభినియమ్‌’ బిల్లు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆకాశంలో సగం అంటూ మహిళలను మెప్పించే మాటలకు పరిమితం కాకుండా వారి శక్తి సామర్థ్యాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించేలా బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలుపుతూ పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నారీశక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లు మహిళా సాధికారితకు బాటలు వేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు