Pawan Kalyan: బురద రాజకీయాలు చేయడం జనసేనకు చేతకాదు: పవన్‌ కల్యాణ్‌

సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

Updated : 20 Apr 2022 18:35 IST

అమరావతి: సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఇందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శనమనన్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. నష్టాలు, అప్పుల బాధతో ప్రకాశం, కర్నూలు జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు. బలవన్మరణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు రైతుల ముందు ఉన్నాయంటే.. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వరం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు బురద రాజకీయాలు చేయడం చేతకాదన్నారు. ఆత్మహత్యలపై రాజకీయాలు చేయడం మానేసి అన్నదాతలకు ఎలా సాయం చేయాలో బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు ఆలోచించాలని పవన్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని