Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ ఇవ్వాలి: పవన్ ఎద్దేవా
సీఎం జగన్‌కు ‘అప్పు రత్న’ అవార్డు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు.
‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి’’ అని పవన్ ఎద్దేవా చేశారు.
(పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన చిత్రం)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా