Pawan Kalyan: మీరు అదే ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని చూడరు: నిప్పులు చెరిగిన పవన్
ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
మంగళగిరి: ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా పవన్ నిప్పులు చెరిగారు.
‘‘రిపబ్లిక్ డే రోజున చెప్తున్నా.. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు. విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కాన్‌స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాగా ఉందా?
ఎంతమంది సీఎంలు రాయలసీమ నుంచి వచ్చారు? ఆ ప్రాంతానికేం చేశారు?అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు?ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం తెలంగాణకు చెందిన జగిత్యాలలో సాయిరెడ్డి చనిపోయారు.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారు. ఆ సంగతి మీకు తెలుసా? మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు. చాలు.. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండి’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: రష్యాలో జిన్‌పింగ్.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
-
India News
Earthquake: దిల్లీలో భూప్రకంపనలు.. భయాందోళనల్లో ప్రజలు!
-
Sports News
UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
World News
Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్‌గా ఐదేళ్ల జీతం!