Pawan Kalyan: పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని: పవన్‌కల్యాణ్‌

రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 

Published : 16 Aug 2022 01:22 IST

అమరావతి: రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తుంటే సీఎం జగన్‌ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడేవారికి తగిన రీతిలో జవాబు చెప్పగలనని వ్యాఖ్యానించారు.

ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవు..

‘‘దేశం అభివృద్ధి చెందుతున్నా డబ్బు మాత్రం కొందరి వద్దే ఉండిపోతుంది. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థల బలోపేతమవుతాయి. వైకాపా నాయకులు దిల్లీ వెళ్లి ఏం చేస్తారో మాకు తెలుసు. వైకాపా ఎంపీలు ప్రధాని ముందు నోరు మెదపరు. రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలి. జనసేన ఆవిర్భవించింది భావితరాల కోసమే. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవు. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం. వైకాపా ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు. 

ఒక్కసారి జనసేన వైపు చూడండి..

వైకాపా ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోంది. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలి.  ప్రజలు ఉపాధిలేక అల్లాడిపోతున్నారు. గుడివాడలో ఇసుక దందా నడుస్తోంది. చిత్తురు జిల్లాలో జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని. పార్టీ నడపటానికి అర్హత వైకాపాకే ఉందా? మాకు లేదా? ఒక్కసారి జనసేనవైపు చూడమని ప్రజల్ని కోరుతున్నా’’ అని పవన్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని