Pawan kalyan: అప్పటి వరకు భరిస్తాం.. దసరా తర్వాత మీ సంగతి చూస్తాం: పవన్ కల్యాణ్
వైకాపా నాయకులకు రూ.లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు.. జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
పర్చూరు: వైకాపా నాయకులకు రూ.లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు.. జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
‘‘యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. కానీ, క్రిమినల్ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు? ప్రజా ప్రతినిధులకు ఒక రూల్.. సామాన్యులకు మరొక రూలా? ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏం చేయలేరనే ధీమాతో ఉన్నారు. సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలి. సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదు. సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా. రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారని వైకాపా ఎమ్మెల్యేలను అడగండి. రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు... ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో వివరంగా చెప్పరు. 2024లో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు ఉపయోగించడంలేదు’’ అని పవన్ విమర్శించారు.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
‘‘జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైకాపా వాళ్లకి ఉన్నప్పుడు రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉంది. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తాం. చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండి. విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కేంద్రాన్ని నిందించడం కాదు.. మన బంగారం మంచిదవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని మన ఎంపీలు గట్టిగా అడగరు. దిల్లీలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటారు. బాధ్యతగల వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కొత్తతరం నాయకులు రాజకీయాల్లోకి రావాలి. ఒకసారి అందరూ జనసేన వైపు చూడింది. పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ప్రతికూల పరిస్థితులే. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రకాశం జిల్లాను మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలి. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదు. 2009లో ఏం చెప్పానో అదే చేస్తా. ప్రజలకోసం, ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించా. వ్యక్తిగతంగా నష్టపోయా. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం. అప్పటి వరకు మీరేం మాట్లాడినా భరిస్తాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.