Published : 15 Aug 2022 01:05 IST

Pawan Kalyan: పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు: పవన్‌

మంగళగిరి: జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఐటీ పరిశ్రమను పెద్ద ఎత్తున తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రానికి ఆర్థికపరిపుష్టి ఎలా సాధ్యమవుతుందని  ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రజలను బలహీనపరిచేలా ఉండకూడదన్నారు.

‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌, బెంగళూరులో ఐటీ అభివృద్ధి జరిగింది. రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడి యువత బెంగళూరుకు వెళ్లిపోతున్నాం.. ఇక్కడ ఐటీ ఎందుకు అభివృద్ధి చేయరని అడిగారు. ఈరోజు మాట ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే.. మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువస్థాయిలో ఐటీ అభివృద్ధి చేస్తాం. ఐటీ పాలసీ అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రలోభ పెట్టడం కాదు. దావోస్‌ వెళ్లి ఫొటోలు దిగి వచ్చినంత మాత్రాన పెట్టుబడులురావు. ముఖ్యమంత్రికి జనసేన తరఫున ఛాలెంజ్‌ చేస్తున్నాం. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు? అద్భుతాలు జరుగుతాయని నేను పార్టీ పెట్టలేదు. కోట్లాదిమందికి నిర్దేశం చేయాలంటే రాజకీయంగా నలగాలి. అనుభవం లేకుండా వస్తే వైకాపా ప్రభుత్వం మాదిరి ఉంటుంది. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా కావాలి. స్థాయి, స్థోమత ఉంటే ప్రజలు మనకు ఆ అవకాశం ఇస్తారు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని