Published : 03 Jul 2022 01:54 IST

Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్‌

అమరావతి: భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించారు. వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాలు, విజయవాడ నగర పరిధిలోని క్రియాశీలక సభ్యులు ఈ తరగతుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్  మాట్లాడుతూ.. ‘‘ఒక తల్లి, బిడ్డలకు కూడా విభేదాలు ఉంటాయి. అలాంటిది మనం విభిన్నమైన ప్రాంతాలు, కులాల మధ్య నుంచి ఒక చోటుకు వచ్చి ఒకేలా ఆలోచించాలంటే కష్టసాధ్యమైంది. తమ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించాలి. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయ వాదం రాదు.  రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ తెదేపాకు, అక్కడ టీఆర్‌ఎస్‌కు ప్రజలు అవకాశమిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవు. కుల, మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలి. జరుగుతున్న విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి చేయాలి. ఇద్దరు ఎంపీల నుంచి ఇక్కడి వరకు భాజపా పోరాటం చేసింది. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుంది. జనసేన కూడా అంతే. ప్రస్తుత రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉంది. మా పార్టీలో మహిళలను చైతన్యవంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని పవన్‌ కల్యాణ్ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని