Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు.

Updated : 19 Jun 2024 13:27 IST

విజయవాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. 

పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రులు

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, తెదేపా నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని