pawan kalyan: ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదు: పవన్‌ కల్యాణ్‌

రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా అనంతపురం జిల్లాలోని నాగులకనుమ వద్ద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శ్రమదానం చేశారు. పవన్‌తో పాటు ఆపార్టీ నేత నాదెండ్లరహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా అనంతపురం జిల్లాలోని నాగులకనుమ వద్ద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శ్రమదానం చేశారు. పవన్‌తో పాటు ఆపార్టీ నేత నాదెండ్ల

Updated : 02 Oct 2021 21:56 IST

అనంతపురం: రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా అనంతపురం జిల్లాలోని నాగులకనుమ వద్ద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శ్రమదానం చేశారు. పవన్‌తో పాటు ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్‌, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ ప్రసంగించారు. 

‘‘రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారు. సీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు. భయపెడితే పరిశ్రమలు ఎక్కణ్నుంచి వస్తాయి. రాయలసీమకు పరిశ్రమలు రప్పిస్తా.. అభివృద్ధి చేస్తా. నెల్లూరు జిల్లాలో చదువుకున్నా.. రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగా. రాయలసీమ చదువుల సీమ. రాయలసీమ .. కరువు సీమగా, వెనుకబడిన ప్రాంతంగా ఎందుకుంది? వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం. వైకాపా పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చే వాళ్లం కాదు. రాయలసీమ పోరాటాల, పౌరుషాల గడ్డ. ప్రజా స్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదు. పోరాడేందుకు తెదేపా కూడా వెనుకంజ వేస్తోంది. సాయిబాబా ఒక్కరే అంత పని చేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలి? నాయకుడు నిజాయతీగా ఉంటే అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి. వచ్చిన కియా పరిశ్రమను కూడా బెదిరించారు. బోయ కులంలోని పేదల కష్టాలను జనసేన గుర్తిస్తుంది’’ అని పవన్‌ కల్యాణ్ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని