
Janasena: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
చౌటుప్పల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. కొంగర సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. జనసేన కార్యకర్తల బీమా పథకం ద్వారా సైదులు భార్యకు రూ.5 లక్షల చెక్కును పవన్ అందించారు. అనంతరం కోదాడలోని శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.
పవన్ అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకుపైగా ఓట్లున్నాయి. అయితే వాటితో గెలవలేం. కానీ.. కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని మాత్రం చెప్పగలను. తెలంగాణ రాజకీయాలను జనసేన శాసిస్తుంది. తెలంగాణలో జనసేన బలోపేతానికి పనిచేస్తాం. రాజకీయాల్లో దెబ్బతిన్న వాడిని కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన బలాలు.. బలహీనతలు నాకు బాగా తెలుసు. తెలంగాణలో ప్రతి జిల్లాలో.. ప్రతి గ్రామంలో జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రతి చోటా మాకు అభిమానుల అండ ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలతో చర్చించి తీసుకుంటాం. తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నారు. ఆశయం కోసం నిలబడేవాడికి ఎప్పటికీ ఓటమి ఉండదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath IAF: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83లక్షల మంది నమోదు
-
Politics News
Telangana News: భాజపాలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి?
-
Sports News
Wimbledon 2022 : వింబుల్డన్‌లో యువ ప్లేయర్ సంచలనం.. అమెరికా దిగ్గజం ఇంటిముఖం
-
Politics News
Andhra News: అలాంటివి ఏపీలో తప్ప మరెక్కడా జరగవు: అశోక్‌బాబు
-
Movies News
Alitho Saradaga: పాత్ర నచ్చితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపీచంద్
-
India News
Udaipur Murder: ఉదయ్‌పుర్ దర్జీ హత్య.. స్లీపర్ సెల్స్ పనేనా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్