Nadendla Manohar: ఫొటోల కోసం కాదు.. సజ్జల అది గుర్తించాలి: నాదెండ్ల
రాష్ట్రంలో చనిపోయిన కౌలురైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారని ఆ పార్టీ రాజకీయవ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటికే ఆరు జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర విజయవంతమైందని తెలిపారు.
సత్తెనపల్లి: కౌలు రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ధూళిపాళ్లలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబాలకు ₹లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడారు.
‘‘పవన్ కల్యాణ్ కౌలు రైతులకు భరోసా ఇచ్చారు. చనిపోయిన కౌలురైతు కుటుంబాలకు అండగా నిలిచారు. ఇప్పటికే ఆరు జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర విజయవంతమైంది. గుంటూరు జిల్లాలో 280 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాం. ఫొటోల కోసమే పవన్ వస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రైతులను ఆదుకోవడానికే పవన్ వస్తున్నారని గుర్తించాలి. రాష్ట్రంలో 3వేల కౌలురైతు కుటుంబాలకు సాయం అందిస్తాం. రైతుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. ప్రభుత్వ సాయం కేవలం పార్టీ వ్యక్తులకే అందుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. జనసేన కార్యక్రమానికి రావద్దని కౌలు రైతులను బెదిరించారు. కార్యక్రమానికి వెళ్తే ప్రభుత్వ సాయం ₹7లక్షలు ఇవ్వబోమన్నారు. బెదిరింపులకు తలొగ్గకుండా కౌలురైతు కుటుంబాలు ముందుకు వచ్చాయి’’ అని నాదెండ్ల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి