Maharashtra: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్‌ సంచలన వ్యాఖ్యలు..!

మహారాష్ట్ర(Maharashtra)లో ఏర్పడిన కొత్త అధికార కూటమిపై ఎన్‌సీపీ(NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 04 Jul 2022 13:50 IST

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లో ఏర్పడిన కొత్త అధికార కూటమిపై ఎన్‌సీపీ(NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు రావొచ్చంటూ వ్యాఖ్యానించారు. ముంబయిలో నిన్న సాయంత్రం తన పార్టీ నేతలతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేశారు.

‘రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో కూలిపోవచ్చు. అందుకే అందరు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వంతో శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఒకసారి మంత్రిత్వ శాఖలు కేటాయించిన తర్వాత.. వారి అసంతృప్తి బయటపడుతుంది. అది చివరకు ప్రభుత్వం కూలే దశకు చేరుకుంటుంది. ఈ వైఫల్యంతో అసమ్మతి ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీ(ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) వైపు వస్తారు. మన చేతిలో కనీసం ఆరు నెలల సమయం ఉందనుకుందాం. అందుకే ఎన్‌సీపీ నేతలంతా వారివారి నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండండి’ అని పవార్ చెప్పినట్లు సమావేశానికి హాజరైన నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే సోమవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. విశ్వాస పరీక్షలో మెజార్టీ మార్కుకు మించి ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. శిందేకు అనుకూలంగా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 99 మంది వ్యతిరేకంగా ఓటెయ్యగా.. ముగ్గురు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని