KTR: వేధింపులకు తిరిగి వడ్డీతో చెల్లిస్తాం

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 09 Jul 2024 04:35 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను సోమవారం రాజకీయ కక్షతో అక్రమంగా కూలగొట్టిన తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ప్రజాపాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన భారాస నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్‌ నివేదిక తెప్పించుకోండి. లేదంటే ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్‌ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు. ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలే ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో భారాస మళ్లీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఆ ఇళ్ల యజమానులకు న్యాయం చేస్తాం. మేము మీలా వేధించాలనుకుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నామరూపాల్లేకుండా పోయేది’’ అని సీఎంను ఉద్దేశించి కేటీఆర్‌ ఆ ప్రకటనలో వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని