Payyavula Keshav: సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా నిజం కాదా?: పయ్యావుల

ఏపీలో సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా తెదేపా నాయకులపై నిరర్ధకంగా కొనసాగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల

Published : 08 Jul 2022 01:59 IST

అమరావతి: ఏపీలో సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా తెదేపా నాయకులపై నిరర్ధకంగా కొనసాగిస్తున్నారని పీఏసీ ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా అని ప్రశ్నించారు. పెగాసస్‌ వ్యవహారంలో వైకాపాది బోగస్ ప్రచారమని ఆరోపించారు. జూమ్‌ ద్వారా పయ్యావుల కేశవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్‌కు సిద్ధమా అని పయ్యావుల సవాల్‌ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేయించడం కాదని.. రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా అని ఆయన నిలదీశారు. పెగాసన్‌ విషయంలో అవాస్తవాలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెగాసస్‌పై శాసనసభ కమిటీ వేసి చర్చ నిర్వహించడం వృథా ప్రయాసే అయిందని ఎద్దేవా చేశారు. ఇదంతా వైకాపా ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని