Payyavula Keshav: జగన్‌ శాసనసభకు రావాలి: మంత్రి పయ్యావుల కేశవ్‌

ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్‌ బాధ్యతలు స్వీకరించారు.

Updated : 19 Jun 2024 14:15 IST

అమరావతి: ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్‌ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత సమావేశాల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. 

అనంతరం తెదేపా శాసనసభాపక్ష కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటం వద్ద మంత్రి నివాళులర్పించారు. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. సభకు మాజీ  సీఎం జగన్‌ రావాలన్నారు. సమస్యలపై ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సభలో స్వపక్షమైనా.. విపక్షమైనా తామేనన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని