ఆ ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం: రేవంత్‌

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం లాంటిదని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పోరాడింది జనార్దన్‌రెడ్డి అని తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకుండా..

Published : 04 Jul 2021 15:12 IST

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం లాంటిదని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పోరాడింది జనార్దన్‌రెడ్డి అని తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో గళమెత్తినందుకే పీజేఆర్‌ను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోలేదన్నారు. దోమలగూడలోని పీజేఆర్‌ ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయన కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డిని కలిశారు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం పీజేఆర్‌ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించాలని పీజేఆర్ పోరాటం చేయడం వల్లనే నగరంలో నీటి సమస్య పరిష్కారమైందని వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు