
Kapil Sibal: పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు..: సిబల్ రాజీనామాపై కాంగ్రెస్ నేత కామెంట్
కొచ్చి: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. పార్టీలోకి వస్తుంటారు.. బయటకు పోతుంటారు అని వ్యాఖ్యానించారు. పార్టీని వీడినందుకు ఎవరినీ నిందించలేమన్నారు. కపిల్ సిబల్ ఇప్పటికే సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీ విలువలను తాను గట్టిగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారన్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ అని.. ఇందులోకి అనేకమంది వస్తుంటారు.. బయటకు పోతుంటారు.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లవచ్చు అని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేపడుతున్నామని.. సమగ్రమైన పునర్ వ్యవస్థీకరణతో ముందుకెళ్తామన్నారు. మున్ముందు అనేక మార్గదర్శకాలు వస్తాయని.. ప్రతి ఒక్కరికీ టాస్క్ ఉంటుందని చెప్పారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఇంటెలిజెన్స్ వంటి కేంద్ర సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత దుర్మార్గంగా రాజకీయ పార్టీలను నిర్మూలనకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సాధిస్తుందన్న విశ్వాసం తమకు ఉందన్న వేణుగోపాల్.. అందుకు తగిన నేతలు కూడా ఉన్నారన్నారు. తాత్కాలికంగా అక్కడక్కడ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. సమస్యల్ని అధ్యయనం చేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
-
India News
Droupadi Murmu: ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
-
Sports News
IND vs IRL: ఐర్లాండ్‌తో పోరు.. 3, 4 స్థానాలు వాళ్లిద్దరివేనా?
-
Movies News
Kiara Advani: ప్రేమ ముఖ్యం.. సారీ చెప్పడానికి ఇబ్బందెందుకు: కియారా అడ్వాణీ
-
General News
Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 19 - 25 )
- Maharashtra Crisis: ఏక్నాథ్ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే