Mamata Benarjee: అప్పుడు ఇందిరా గాంధీని క్షమించలేదు.. ఇప్పుడు మోదీనీ క్షమించరు!

నూతన సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజలు క్షమించబోరని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాణించి.. భాజపాకి ప్రత్నామ్నాయంగా మారేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే

Published : 03 Dec 2021 01:30 IST

ముంబయి: నూతన సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజలు క్షమించబోరని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాణించి.. భాజపాకి ప్రత్నామ్నాయంగా మారేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయిలో పర్యటిస్తున్న ఆమె.. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. తాజాగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎదురైన అనుభవమే మోదీకి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. 

‘‘ఇందిరా గాంధీ చాలా శక్తిమంతమైన నాయకురాలు. కానీ, ఆమె పేరు చెబితే ముందుగా ‘ఎమర్జెన్సీ’నే గుర్తొస్తుంది. ఆమెకు అదో మాయని మచ్చగా నిలిచిపోయింది. 1977లో ఇందిరా గాంధీ క్షమాపణలు చెప్పినా.. ప్రజలు ఆమెను క్షమించలేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైతులకు క్షమాపణ చెప్పారు. కానీ.. ఆయనేంటో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మోదీని క్షమించరు. యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే.. ఆ భయంతోనే సాగు చట్టాలను ఎలాంటి చర్చలు లేకుండానే రద్దు చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు’ అని మమతా బెనర్జీ అన్నారు. 

అంతకుముందు యూపీఏ కూటమిపై కూడా మమతా బెనర్జీ వ్యంగ్యంగా స్పందించారు. ‘యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి..? యూపీఏ లాంటిదేమీ లేదు’ అని అన్నారు. భాజపాను ఓడించాలంటే ప్రత్యామ్నాయం అవసరమని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామని చెప్పారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని