మమత నుంచి ‘మమత’ కరవు: మోదీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన.....

Published : 08 Feb 2021 01:41 IST

హల్దియా (పశ్చిమ బెంగాల్‌): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నుంచి ‘మమత’ (ఆప్యాయత)ను ప్రజలు ఆశిస్తే ఆమె నుంచి నిర్మమత (క్రూరత్వం) లభించిందంటూ ప్రాసలు ఉపయోగిస్తూ విమర్శలు ఎక్కుపెట్టి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

తృణమూల్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. వామపక్ష ప్రభుత్వానికి తృణమూల్‌ ప్రభుత్వం పునర్జన్మలాంటిదే తప్ప ఇంకొకటి కాదన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదిస్తే నచ్చని మమత.. దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేసే కుట్రలపై నోరు మెదపరని అన్నారు. తృణమూల్‌ హయాంలో నేరాలు వ్యవస్థీకృతమైపోయాయని దుయ్యబట్టారు. అందుకే ప్రజలు రాబోయే ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టాలని భావిస్తున్నారని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో అమలయ్యేలా తొలి కేబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకుంటామని మోదీ చెప్పారు. 

ఇవీ చదవండి..
సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్‌ స్పష్టత
దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు: మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని