తమిళనాడులో మహిళలకు రక్షణ లేదు: కమల్‌

తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆరాటపడుతున్నారని మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి పార్టీలకు కాకుండా జనం తమకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.........

Published : 05 Jan 2021 02:17 IST

సేలం: తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆరాటపడుతున్నారని మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి పార్టీలకు కాకుండా జనం.. ఎంఎన్‌ఎంకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపైనా, ఎంఎన్‌ఎంపైనా ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలే ఇందుకు సాక్ష్యమన్నారు. సోమవారం సేలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్‌.. తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ఎంఎన్‌ఎంకు ఓటేయడం ద్వారా ఇలాంటి పరిస్థితిని తిప్పికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పునకు నాంది పలికేందుకు చరిత్రాత్మక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

గృహిణులు సైతం తమ పార్టీ గోడ పత్రికలను అతికించడం ద్వారా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఏప్రిల్‌ - మే నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎంఎన్‌ఎం గెలుస్తుందని, అధికారం దక్కించుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తమిళనాడును పాలించిన ప్రభుత్వాలు (అన్నాడీఎంకే, డీఎంకే పేర్లు ప్రస్తావించకుండా) పేదరికాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాయంటూ మండిపడ్డారు. ఆ పార్టీలకు భిన్నంగా తాము ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నామని చెప్పారు. తమ పార్టీ ఎన్నికల వ్యూహం నిజాయతీయేనని పునరుద్ఘాటించారు. నిజాయతీకి ఓటర్లు ఉన్నత స్థానం కల్పించాలని, మంచి వాళ్లకు అవకాశం ఇస్తే.. తమిళనాడు పునర్నిర్మితమవుతుందన్నారు.

ఇదీ చదవండి..

స్టాలిన్‌ ఎప్పటికీ సీఎం కాలేరు: అళగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని