Updated : 23 Mar 2022 05:38 IST

Perni Nani: అలాగైతే కొత్తపల్లి సుబ్బారాయుడు చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలి: పేర్ని నాని

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా విభజన విషయంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించుకున్నందున చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్ని పేర్ని నాని తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

‘‘బాధ్యతాయుతమైన పదవులెన్నో చేసి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ.. ఈ విధంగా మాట్లాడటం ఆయన విలువనే తగ్గించే పరిస్థితి. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. నరసాపురం జిల్లా చేస్తూ, ఆ జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధం ఉంటుంది. 7 నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందని భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశాం. దీనిపై సుబ్బారాయుడికి ఏమైనా అభ్యంతరాలుంటే సీఎంను కలిసి వివరిస్తే అది సముచితం, పద్ధతి. ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఇది కరెక్టు కాదు. మనకు నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే ఆయన చాలా సార్లు చెప్పుతో కొట్టుకోవాలి’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని