Perni nani: పవన్‌ కల్యాణ్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి: పేర్ని నాని

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Updated : 08 Apr 2022 04:15 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల చీలికకు సంబంధించి పవన్‌ వ్యాఖ్యలు అసంబద్ధమన్నారు. ‘‘ఓట్ల చీలికపై ఏమిటి ఆయన మాట్లాడేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని ప్రకటించేస్తే అయిపోతుందా?. హాబీగా పాలిటిక్స్‌ చేస్తుంటాడు. 2012లో పార్టీ పెట్టడానికి చంద్రబాబుని కలిశానని చెబుతారు. పార్టీ పెట్టడానికి చంద్రబాబును కలవడమేంటి? ఆయనేమైనా ఎన్నికల కమిషనరా? పార్టీ పెడితే ఎవరిని కలుస్తాం. ఎలక్షన్‌ కమిషన్‌ను కలుస్తాం. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఇద్దరూ పోటీపడి పవన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు. వాళ్లేమయ్యారు.. వీళ్లేమయ్యారు. చిన్నప్పుడే కంకి కొడవలి పట్టుకున్నానని చెప్పిన పవన్‌ ఇప్పుడు వాళ్లను దూరం పెట్టారు. గతంలో పవన్‌ వెనుక చేగువేరా ఫొటో ఉండేది. ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నారు. ఇప్పుడేమో భాజపా చంకలో ఉండి.. చంద్రబాబుకు కన్ను కొడతాడు. ఓ వైపు ప్రేమ వ్యవహారం, కాపురం భాజపాతో... కిటికీ తీసి చంద్రబాబుకు కన్ను కొడతాడు. పవన్‌ కల్యాణ్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని