Pilot Rohit Reddy: నాకు రూ.100కోట్లు.. నాతో చేరేవారికి రూ.50కోట్ల ఆఫర్‌ ఇచ్చారు: రోహిత్‌రెడ్డి

తెరాస ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు..

Updated : 27 Oct 2022 11:44 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌(ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)పై కేసు నమోదు కేసినట్లు రాజేంద్రనగర్‌ ఏసీపీ తెలిపారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలను పోలీసులు పొందుపర్చారు.

భాజపాలో చేరితే రూ.100కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌రెడ్డికి సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని.. నందకిశోర్‌ (నందు) మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజి వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరితే రూ.100కోట్లు ఇస్తామని భాజపా తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్‌ రోహిత్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఆయన పేర్కొన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. భాజపాలో చేరితే సెంట్రల్‌ సివిల్ కాంట్రాక్టులతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారంటూ రోహిత్ రెడ్డి చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు రోహిత్‌ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు