Karnataka Elections: కర్ణాటక కాంగ్రెస్‌కు అభినందనలు: మోదీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్‌ విజయం (Congress Victory) సాధించిన కాంగ్రెస్‌ను మోదీ అభినందించారు. ప్రజల ఆ కాంక్షలను ఆ పార్టీ నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.

Updated : 13 May 2023 18:46 IST

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌ను (Congress Victory) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. భాజపా కోసం కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 136 సీట్లు సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకి మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. అకుంఠిత దీక్షతో పని చేసిన ప్రతి ఒక్క భాజపా కార్యకర్తను అభినందిస్తున్నా. రానున్న కాలంలో శక్తివంచన లేకుండా కర్ణాటకకు సేవ చేద్దాం’’ అని కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరో ట్వీట్‌ చేశారు.

కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 సమావేశాలు, రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని రాకతో భాజపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈసారి కూడా భాజపా విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేసింది. కానీ, ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. మరోవైపు కర్ణాటకలో భాజపా పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని ఆయన అన్నారు.

  • ‘‘భాజపాకు ఇన్నాళ్లు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని భాజపా కర్ణాటక ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తుంది.’’ - కర్ణాటక ఫలితాలపై అమిత్‌ షా
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని