రైతులను కలిసేందుకు సమయమే లేదా?

దేశాన్ని ఆత్మనిర్భర్‌గా నిలిపిన రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రధాని మోదీకి సమయమే దొరకడంలేదా అని కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. రైతులకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు.

Published : 10 Feb 2021 19:18 IST

ప్రధానిపై విమర్శలు గుప్పించిన ప్రియాంకాగాంధీ

లక్నో: దేశాన్ని ఆత్మనిర్భర్‌గా నిలిపిన రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రధాని మోదీకి సమయమే దొరకడంలేదా అని కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ప్రశ్నించారు. రైతులకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ జై జవాన్‌.. జై కిసాన్‌ 10వ రోజు ఉద్యమంలో భాగంగా ఆమె ఉత్తరప్రదేశ్‌ చేరుకున్నారు. ‘‘ ప్రస్తుత ప్రభుత్వం రైతులను దేశద్రోహులుగా అభివర్ణిస్తోంది. రైతులు చేసే ప్రతీదీ ఈ నేల కోసమే. వారు ఏ విధంగా దేశద్రోహులవుతారు.’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌, చైనాలకు వెళ్లేందుకు ప్రధానికి సమయముంటుంది కానీ రైతుల సమస్యలు వినేందుకు సమయం లేదా? అని ప్రియాంక ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా రైతులను ‘ఆందోళనజీవులు’ అని సంబోధించి ప్రధాని వారిని అవమానించారన్నారు.

‘ఆందోళనలు చేసే కొత్త వర్గం పుట్టుకొచ్చింది. వారు ఉద్యమాలు చేసేందుకే ప్రయత్నిస్తారు. కొత్త ఉద్యమాల కోసం వారు దారులు వెతుక్కుంటారు. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి.’’ అని సోమవారం పార్లమెంటులో ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం స్పందిస్తూ.. తాను ఆందోళన జీవినని చెప్పుకొనేందుకు గర్విస్తున్నానని ట్వీట్‌ చేశారు. ప్రఖ్యాత ఆందోళన జీవి మహాత్మా గాంధీ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

ట్విటర్‌కు పోటీగా కూతకొచ్చింది

కొత్త చట్టాలతో ఏ రైతుకూ నష్టం కలుగదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని