- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
భాజపా ముఖ్య నేతలతో ప్రధాని కీలక భేటీ!
దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కేంద్రమంత్రులు, కేంద్ర సహాయ మంత్రులతో గ్రూపుల వారీగా చర్చిస్తున్న ప్రధాని.. గత రెండేళ్లలో ప్రభుత్వ పనితీరును శాఖలవారీగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు నితిన్ గడ్కరీ, డీవీ సదానంద గౌడ, మురళీధరన్‌తో పాటు మరికొందరు ఉన్నారు. ప్రధాని అధికారిక నివాసమైన 7 - లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరుగుతున్న ఈ భేటీల్లో అత్యధికసార్లు జేపీ నడ్డా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, జితేంద్రసింగ్‌తో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మోదీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ వెలువడలేదు. ఈ సమావేశాలన్నీ ఐదు గంటలకు పైగా జరిగినట్టు జరిగినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్దకశాఖ, మత్స్య, గిరిజన వ్యవహారాలు, అర్బన్ డెవలప్మెంట్, సాంస్కృతిక, పౌర విమానయాన, రైల్వే, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, జలశక్తి, పెట్రోలియం, ఉక్కు, విదేశీ వ్యవహారాలు, పర్యావరణ శాఖల కేంద్రమంత్రులు/ సహాయమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు సమాచారం. 2019 మే నెలలో రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు జరగకపోవడం గమనార్హం. కేంద్రమంత్రి మండలిలో మొత్తం 79 మందిని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రెండు డజన్లకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో తగిన మార్పులు చేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: అభిమానికి క్యాన్సర్.. అండగా నిలిచిన చిరంజీవి
-
India News
Arvind Kejriwal: ప్రజలు పేదలుగా ఉంటే.. దేశం ధనికంగా మారదు.. కేంద్రంపై కేజ్రీవాల్ కౌంటర్
-
Sports News
Deepak - Virat : దీపక్‌కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!
-
Politics News
CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్
-
Politics News
Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
-
General News
Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం