PM Modi: ఏపీ విభజన తీరుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి

Updated : 08 Feb 2022 17:35 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 

‘‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్‌ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్‌ హయాంలో సభలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగా లేదు. సరిగా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ దుయ్యబట్టారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని