- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
PM Modi: అప్పట్నుంచి వాళ్లకు నిద్ర కరువైంది: మోదీ
కన్నౌజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో తొలివిడత పోలింగ్ పూర్తయిన తర్వాత వారసత్వ పార్టీల నేతలకు నిద్రకరవైందన్నారు. వారు కలలు కూడా కనలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో కుటుంబ పార్టీలే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మార్చేశాయని మండిపడ్డారు. అలాంటి నేతలకు ప్రజాస్వామ్యమంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటైన ప్రభుత్వం కాదనీ; కుటుంబం చేత కుటుంబం కొరకు ఏర్పాటైన ప్రభుత్వం అంటూ ప్రధాని చురకలంటించారు. అల్లర్లు, మాఫియా శక్తుల ఆటకట్టించేది భాజపా ప్రభుత్వమేనని ప్రజలు గమనించారన్నారు.
‘‘ఈ ఎన్నికల్లో యూపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు కాదు అనేది చర్చ కాదు. భాజపానే వస్తుందని రాష్ట్రమంతా తెలుసు. యోగి సీఎం అవుతారని దేశమంతా తెలుసు. గతంలో కన్నా ఎన్ని సీట్ల మెజార్టీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందనేందుకే ఈ పోటీ జరుగుతోందన్నారు. రెండు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు నిద్రపోవడంలేదు. కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేసి ఓట్లను చీల్చాలని చూస్తున్నారు. కానీ, మాఫియాలు, అల్లరి మూకలకు వ్యతిరేకంగా యూపీ ప్రజలు ఐక్యంగా ఓటు వేయడం నాకెంతో సంతోషంగా ఉంది. అల్లరిమూకలు, గూండాలకు చికిత్సకు మందు భాజపా ప్రభుత్వం వద్దే ఉందనేది రాష్ట్రంలోని సాధారణ ఓటర్లకు కూడా అర్థమైంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధి, లక్షలాది మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్య చికిత్సలు, దశాబ్దాల క్రితంనాటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి.. ఇవన్నీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఫలితమే’’ అని మోదీ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
-
General News
Telangana News: సామూహిక ‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ
-
Movies News
Bimbisara: ‘బింబిసార’ కోసం ఇంత కష్టపడ్డారా.. పోరాట దృశ్యాలు ఎలా షూట్ చేశారంటే!
-
Technology News
PC Health Checkup: కంప్యూటర్/ల్యాప్‌టాప్ హెల్త్ చెకప్.. ఇలా చేయండి!
-
Sports News
Virat Kohli: ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తాం: గంగూలీ
-
World News
Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు