Modi tour in Hyd: బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.

Updated : 26 May 2022 13:10 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.

ప్రధాని రాక సందర్భంగా బేగంపేటలో భాజపా నేతలు స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని వెళ్లనున్నారు. మోదీ రాక సందర్భంగా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని